Published On:

YSRCP: “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల

YSRCP: “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం” పుస్తకం విడుదల

Sajjala Ramakrishna Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ తాజాగా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంలో జరిగిన స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి “జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. గత ఏడాది మూడు పార్టీల కలయికగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారు. ప్రజల గొంతు వినకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉపయోగించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. 2019లో వైసీపీ ఒంటరిగానే పోటీచేసి విజయం సాధించిందన్నారు. జగన్ తొలి ఏడాది పాలనలో బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారు. ప్రతి రంగానికి విశ్వసనీయతను అందించారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. చంద్రబాబు ఈ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని విమర్శించారు. ప్రభుత్వ శాఖలను, పనితీరును నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. ప్రజలకు నిజాలు తెలిపాలనే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అందులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ ఆధారాలపై ఆధారపడ్డాయని, ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి నిశితంగా విశ్లేషించాలని నేతలు కోరారు.