Uber: ఉబర్ కంపెనీపై సైబర్ అట్టాక్
తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
Uber: తెలుగురాష్ట్రాల్లో ఓలా తర్వాత అంత క్రేజ్ ఉబర్ ట్యీక్సీ సర్వీస్ కే ఉందనే చెప్పవచ్చు. కాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్నెట్ ట్యాక్సీ సర్వీసెస్ అయిన ఈ ఉబర్ హ్యాకింక్ కు గురైంది. సంస్థకు చెందిన ఓ ఉద్యోగి వర్క్ స్పేస్ మెసేజింగ్ యాప్ లోకి హ్యాకర్లు చొరబడ్డారు. దానితో ఉబర్ డేటా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఉబర్ సంస్థ అఫీసియల్ గా వెల్లడించింది.
ఇటీవలె కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. పెద్దపెద్ద ఆన్లైన్ సంస్థలను టార్గెట్ గా చేసి హ్యాకర్లు పేట్రేగిపోతున్నారు. వీరిలో ముఖ్యంగా ‘లాప్సస్$’ అనే హ్యాకింగ్ గ్రూప్ తమపై ఈ సైబర్ దాడికి పాల్పడిందని ఉబర్ పేర్కొనింది. పెద్దపెద్ద టెక్నాలజీ కంపెనీలను హ్యాక్ చేసేందుకు లాప్సన్ ఈ పద్ధతులను పాటిస్తోందని… ఈ సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్, సిస్కో, శామ్సంగ్, ఎన్విడియా, ఓక్టా వంటి వాటిపై కూడా సైబర్ దాడి చేసింది లాప్సస్ ఏ అని ఉబెర్ పేర్కొంది.
కాగా హ్యాకర్లు తమ కంపెనీ మొబైల్ యాప్‌లకు శక్తినిచ్చే ‘ప్రొడక్షన్ సిస్టమ్‌లను’ యాక్సెస్ చేయలేదని ఉబర్ వెల్లడించింది. కాబట్టి వినియోగదారుల ఖాతాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా సమాచారం, ట్రావెల్ హిస్టరీ వంటి సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే డేటా బేస్‌లు సురక్షితంగా ఉన్నాయని కంపెనీ హామీ ఇచ్చింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటాను చాలా భద్రంగా ఉంచుతామని, అదనపు రక్షణ కల్పిస్తామని ఉబర్ తెలిపింది.
ఇదీ చదవండి: Delhi Crime News: భర్తనే బెదిరించిన భార్య… అత్తమామల ప్రైవేట్ వీడియోలు బయటపెడతానంటూ..!