Home / వీడియోలు
శిల్పకళా వేదికలో మార్చి 26 ఆదివారం నాాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అట్టహాసంగా వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
చిరుధాన్యాలకు పునర్వైభవం వస్తోంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, పండిచడం లాంటివి చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం మెండు కాబట్టి యావత్ ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. దానితో రైతులు సైతం వీటి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరి చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం ఇన్నాళ్ళకు బట్టబయలైంది. సోషల్ మీడియా వేదికగా స్టోరీ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వివాదం బయటపడింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Millets: ఆరోగ్యాన్ని కాపాడటంలో చిరుధాన్యాల పాత్ర కీలకమైంది. దీంతో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఈ చిరు ధాన్యాల సాగులో సరైన మెళకువలు పాటిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.
మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. కాగా ఈ సభలో చివరిసారి పవన్ చూడడం కోసం దిగ్విజయ సభకు క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు రావడం గమనార్హం.
జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పుడు అభిమాన సముద్రం మధ్య విజయవాడ నోవాటెల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం బయలు దేరారు. అంతకుముందు బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వారాహి వద్దకు పవన్, నాదెండ్ల మనోహర్ చేరుకునున్నారు.
అనంతపురం జిల్లా రైతులు వినూత్న ఆలోచనా పద్ధతులతో అరటి సాగు చేస్తున్నారు. జిల్లాలో వీచే ఈదురు గాలుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు అరటి చెట్లకు బెల్ట్ సిస్టం ఏర్పాటు చేసి అరటిని పండిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో వారాహి టూర్ కి సిద్ధమయ్యారు. మంగళగిరి వేదికగా బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో బీజేపీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా రైతులు సశ్యరక్షణ చర్యలు తీసుకుంటూ మునగసాగులో దూసుకుపోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంత రైతులు మరి ఈ మునగసాగు మెలకువలు ఏంటో ఆ రైతు మాటల్లోనే విందాం.