Today Gold And Silver Price: గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు
Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా.. బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటుంన్నాయి. అయితే ఆదివారం రోజు బంగారం ధరలో మార్పులేదు కానీ.. వెండి మాత్రం కాస్త పెరిగింది. ఇక తాజాగా నేడు ( జూలై 18, 2023 ) బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ. 54,980 కాగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,980 ఉంది. తులం బంగారంపై దాదాపు రూ.20 మేర తగ్గింది. ఇదిలా ఉంటే కేజీ వెండి ధర 77,700గా కొనసాగుతూ ఉంది. నిన్నటితో పోల్చితే వెండి ధర రూ.200 మేర పెరిగింది.
బంగారం ధరలు ఇలా(Today Gold And Silver Price)
ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,130 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.54.980 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాములు గోల్డ్ ధర రూ.59,980గా కొనసాగుతుంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాములు పుత్తడి ధర రూ.55,360 కాగా 24 క్యారెట్లు పసిడి ధర రూ. 60,390 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54.980 ఉంటే 24 క్యారెట్లు తులం బంగారం ధర రూ.59,980గా ఉంది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.54.980 ఉంటే, 24 క్యారెట్లు పసి ధర రూ.59,980 ఉంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.54.980 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,980 గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికొస్తే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,700 గా ఉంది. ముంబైలో రూ.77,700, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో రూ. 77000 లుగా ఉంది. అలాగే తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.81,500 లుగా కొనసాగుతుంది.