Last Updated:

UPI Transactions: మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా ?

వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.

UPI Transactions: మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే నుంచి డబ్బును తప్పు నంబర్‌కి పంపారా ?

UPI Transactions: ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ రోజురోజుకీ మారుతూనే ఉంటుంది. గతంలో డబ్బులు వేరే వారికి పంపాలన్న, తీసుకోవాలన్న కూడా బాంకు లకు పోయి గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించేది. ఇలా బ్యాంక్ సేవలు ఏది పొందాలన్నా కానీ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సి వచ్చేది. బ్యాంకుల వద్ద కస్టమర్ల రద్దీ వల్ల క్యూలోనే సమయం చాలా వృథా అయ్యేది. కానీ ఆధునిక టెక్నాలజీ వల్ల బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. డబ్బులు వేరేవారికి పంపాలన్న, బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలన్నా, వేరే వరి నుంచి మనం డబ్బులు తీసుకోవాలనుకున్న కూడా మన మొబైల్ లోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి.

అయితే టెక్నాలజీ మరింత అప్డేట్ అవుతుండడంతో స్మార్ట్ ఫోన్ నుంచి మన బ్యాంక్ లావాదేవిలను కొనసాగించగలుగుతున్నాం. గతంలో తక్కువ మంది మాత్రమే మొబైల్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించేవారు. కానీ కరోనా వల్ల ఆన్ లైన్ బ్యాంకు సేవలను వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య బాగా పెరిగింది. దీంతో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే వంటి యూపీఐ యాప్ లను వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి యూపీఐ మోడ్ పేమెంట్ సొంత పరిమితులు ఉంటాయి. అంటే రోజుకు ఎంత వరకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే లిమిట్ ఉంటుంది.

సాధారణంగా అన్ని యూపీఐ యాప్స్ ద్వారా ఒక రోజులో లక్షకు పైగా మనీ ట్రాన్స్ ఫర్ చేయలేము. అలానే ఒక రోజులో 10 కంటే ఎక్కువ సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి కుదరదు. వీటితో పాటే ఎవరి నుంచైనా రూ.2 వేల కంటే ఎక్కువ అమౌంట్ ను రిక్వెస్ట్ కోసం ట్రై చేసిన ఆ లావాదేవీ ఫెయిల్ అవుతుంది. ఒకవేళ మీ డెయిలీ మనీ ట్రాన్స్ ఫర్ లిమిట్ దాటితే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చిన్నమొత్తంలో గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపేందుకు రిక్వెస్ట్ పంపుకోవచ్చు. అయితే వీటి వల్ల లాభాలు ఉన్నప్పటికి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…

ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ లోనే బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటున్నాం. కానీ ఈ తరుణంలోనే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్ లు ఇస్తాం, ఆన్లైన్ లో డబ్బులు పంపండి అంటూ మోసాలకు పాల్పడుతూ ఉంటారు. అలానే సైబర్ నేరగాళ్ల ద్వారానే కాకుండా ఒక్కోసారి మన తప్పిదాల వల్ల కూడా మనకి నష్టం వాటిల్లుతుంది. వాటిలో ముఖ్యంగా వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి. ఇటువంటి సందర్భాల్లో డబ్బును

సురక్షితంగా పంపించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే…

  • ముందుగా డబ్బును పంపించాల్సిన వ్యక్తి నెంబర్ ని ఒకటికి, రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
  • మనం సేవ్ చేసుకున్న నంబర్ ని ఎంటర్ చేసినప్పుడు వచ్చే పేరు అతనిదా కాదా అని సరి చూసుకోవాలి.
  • ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బు పంపేందుకు ఇబ్బంది ఎదురవ్వవచ్చు. ఈ తరుణంలోనే ముందుగా పేమెంట్స్ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడడానికి ఒక రూపాయి లేదా తక్కువ మొత్తంలో డబ్బును పంపడం మంచిది.
  • లేదా సదరు వ్యక్తికి డబ్బులు పంపించే ముందు గూగుల్ పే లేదా ఫోన్ పే లలో మెసేజ్ చేసే సదుపాయం కూడా ఉన్నందున ముందు మెసేజ్ పంపి సరైన వ్యక్తులకే డబ్బులు పంపుతున్నామా అని సరి చూస్కోవడం ఉత్తమం.

ఒకవేళ డబ్బును తప్పు నంబర్‌కి పంపితే…

  • ఒకవేళ డబ్బును తప్పు నెంబర్ కి పంపితే చింతించాల్సిన అవసరం లేదు.
  • భారతీయ రిజర్వు బ్యాంకు సూచనల ప్రకారం డబ్బును పొరపాటున తప్పు నెంబర్ కి పంపితే ముందుగా చెల్లింపు చేసిన సదరు యూపీఐ సంస్థకు కంప్లైంట్ చేయాలి.
  • గూగుల్ పే లేదా ఫోన్ పే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాలి.
  • అందుకు సంబంధించిన లావాదేవీని ఋజువుగా ఉంచుకోవాలి.
  • సదరు సంస్థ మన సమస్యను పరిష్కరించలేక పోతే ఆర్ బి ఐ వారు ఫిర్యాదులను పరిషకరించడానికి నియమించే సీనియర్ అధికారికి ( అంబుడ్స్ మెన్ కి) ఫిర్యాదు చేయాలి
  • సదరు వ్యక్తి మన సమస్యను ఖచ్చితంగా పరిశీలించి పరిష్కరిస్తారు.ఈ విధంగా మనం మనం మన డబ్బును తిరిగి పొందవచ్చు. ఒకవేళ సదరు వ్యక్తి మంచివారైతే ఫోన్ చేసి సమస్యను అతనికి తెలిపి తిరిగి డబ్బులు పంపమని కూడా పంపమని కోరవచ్చు. ప్రస్తుత కాలంలో అలా తిరిగి డబ్బులు పంపించే వారిని చాలా అరుదు గానే చూడగలుగుతాము.

ఇవి కూడా చదవండి: