Last Updated:

Samsung Galaxy F16 5G First Sale: రేపు రెడీగా ఉండండి.. రూ.11,499లకే సామ్‌సంగ్ 5జీ ఫోన్.. వణుకు పుట్టిస్తుంది..!

Samsung Galaxy F16 5G First Sale: రేపు రెడీగా ఉండండి.. రూ.11,499లకే సామ్‌సంగ్ 5జీ ఫోన్.. వణుకు పుట్టిస్తుంది..!

Samsung Galaxy F16 5G First Sale: టెక్ దిగ్గజం సామ్‌సంగ్ మరో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. గతేడాది మార్చిలో విడుదల చేసిన Samsung Galaxy F15 5G ఫోన్‌కు సక్సెసర్‌గా పరిచయం చేసింది. మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Samsung Galaxy F16 5G భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌ను సుమారు రూ.15,00 బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తుంది. ఈ ఫోన్ ఎంట్రీ ప్రత్యర్థ కంపెనీలకు వణుకు పుట్టిస్తుంది. ఈ సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F16 5G మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. అలానే 6.7 అంగుళాల డిస్‌ప్లే, 8GB RAM, 128GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Samsung Galaxy F16 5G Offers
Samsung Galaxy F16 5G ఫోన్ ధర అన్ని ఆఫర్‌లతో కలిపి రూ.11,499 నుండి ప్రారంభమవుతుంది. మొదటి సేల్‌ను మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనుంది. మీరు ఈ మొబైల్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 4GB RAM 128GB ధర రూ 13,499. 6GB RAM 128GB స్టోరేజ్ ధర రూ 14,999. 8GB RAM 128GB స్టోరేజ్ ధర రూ 16,499.

Samsung Galaxy F16 5G Features And Specifications
Samsung Galaxy F16 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1,080 x 2,340 పిక్సెల్‌ల రిజల్యూష, 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 OSతో పని చేస్తుంది. ఫోన్ గరిష్టంగా 8GB RAMతో ప్రారంభించారు. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

Samsung Galaxy F16 5G స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమెరా సెటప్‌ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ థర్డ్ (మాక్రో) కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మొబైల్‌లో 5000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారరు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, గెలీలియో, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.