Last Updated:

Vivo T4x 5G First Sale Offers: ఏమైంది బ్రో.. వివో కొత్త ఫోన్‌పై ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు.. సేల్ స్టార్ట్..!

Vivo T4x 5G First Sale Offers: ఏమైంది బ్రో.. వివో కొత్త ఫోన్‌పై ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు.. సేల్ స్టార్ట్..!

Vivo T4x 5G First Sale Offers: వివో తన విభిన్న శ్రేణి స్మార్ట్‌ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీంతో ప్రముఖ కంపెనీ ఫోన్లకు భారీ పోటీ ఇస్తోంది. ఇటీవలే కొత్త Vivo T4x 5G మొబైల్‌ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. రూ.13,000 కంటే తక్కువ బడ్జెట్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మొబైల్ ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. అయితే తొలిరోజే ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసే కస్టమర్లకు కంపెనీ ఓ బాంబ్‌షేల్ ఆఫర్ ప్రకటించింది. ఈ వివో ఫోన్ ధర, ఆఫర్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Vivo T4x 5G మొబైల్ దాని స్టైలిష్ లుక్, పనితీరు, ఫీచర్లతో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలానే 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంది. . ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లోని 6,500mAh బ్యాటరీ 44W ఛార్జింగ్‌తో కూడా వస్తుంది.

Vivo T4x 5G Offers
Vivo T4x 5G ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదలైంది. 6GB RAM + 128GB ధర రూ.13,999. 8GB RAM + 128GB ధర రూ.14,999. 8GB RAM + 256GB ధర 16,999. మొదటి సేల్‌పై కంపెనీ రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. మీరు ఈ వివో ఫోన్‌ బేస్ వేరియంట్‌ను డిస్కౌంట్‌తో రూ. 12,999కి కొనుగోలు చేయచ్చు. ఈ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్‌కి వచ్చింది. మెరైన్ బ్లూ, ప్రోటాన్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

Vivo T4x 5G Features And Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది పంచ్ హోల్ స్టైల్ LCD డిస్‌ప్లే. ఈ స్క్రీన్ 2,408 × 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15తో పని చేస్తుంది.

Vivo T4x 5G ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మొబైల్‌లో 6,500mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 44W ఫాస్ట్ ఛార్జింగ్ అందిచారు. ఈ మొబైల్‌ని IP64 రేటింగ్ చేవారు. ఇది OTGతో పాటు బ్లూటూత్ 5.4, Wi-Fi 6కి సపోర్ట్ ఇస్తుంది. ఇందులో టీవీ రిమోట్ లాగా పనిచేసే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది.