Vivo Mobile Offers: పోతే రావ్ మావా.. వివో ఫోన్లపై భారీ ఆఫర్లు.. తోపు డీల్ ఇది..!
Vivo Mobile Offers: టెక్ బ్రాండ్ వివోకు గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వివో ప్రతి విభాగంలోనూ సరికొత్త ఫీచర్లను అందిస్తూ ప్రత్యేకను చాటుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా గమనించాల్సింది కెమెరా టెక్నాలజీ. వివో ఫోన్లలో హై క్వాలిటీ ఫ్రంట్, బ్యాక్ కెమెరా ఉంటాయి. ఫోటోగ్రఫీ ప్రియులను బాగా ఆకట్టుకుంటాయి. ఇందులో భాగంగానే కంపెనీ టి-సిరీస్‌లో Vivo T3 Pro, Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ ఫోన్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించింది.
Vivo T3 Pro, T3 Ultra Offers
వివో టి3 ప్రో బేస్ వేరియంట్ 8GB + 128GB రూ. 24,999, 8GB + 256GB రూ. 26,999 వద్ద ప్రారంభించారు. ప్రస్తుతం, కంపెనీ దీని ధరను రూ. 2,000 తగ్గించింది, దీని ప్రారంభ ధరను రూ.22,999కి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ కలర్‌లలో లభిస్తుంది.
వివో టి3 అల్ట్రా 8GB + 128GB వేరియంట్ రూ. 31,999, 8GB + 256GB రూ. 33,999, 12GB + 256GB మోడల్ రూ. 35,999 వద్ద ప్రారంచారు. రూ. 2,000 తగ్గింపు కూడా ఉంది, దీనితో ఫోన్‌ను రూ. 29,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ అల్ట్రా మోడల్ లూనార్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Vivo T3 Pro, T3 Ultra Specifications
వివో టి3 ప్రో, వివో టి3 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్, 4500నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వివో ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ అందుబాటులో ఉంది. ఇది 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14 పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ గురించి మాట్లాడితే OIS, EISతో కూడిన 50MP సోనీ ప్రైమరీ కెమెరా సెన్సార్ అందించారు. దీనితో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. ఈ వివో ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. వివో టి3, టి3 ప్రోలో 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, పీక్‌బ్రైట్నెస్ 4,500నిట్స్, HDR10+.
ఈ ఫోన్‌లో MediaTek డైమెన్షన్ 9200+ SoC ఉంది. ఈ ఫోన్ 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది, OISతో కూడిన 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన 8MP అల్ట్రా-వైడ్ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు, 50MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.