Last Updated:

Moto G64 5G: స్టన్నింగ్ డీల్.. మోటో 5జీ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. ఫీచర్స్ ఓకే..!

Moto G64 5G: స్టన్నింగ్ డీల్.. మోటో 5జీ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. ఫీచర్స్ ఓకే..!

Moto G64 5G: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్,  డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలంటే ఈ డీల్ Motorola ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh పెద్ద బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. రూ. 17,999. అయితే ఇప్పుడు రూ.16 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2000 తగ్గింపు లభిస్తుంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుందాం.

Moto G64 5G స్మార్ట్‌ఫోన్  8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ ధరకు బదులుగా రూ. 14,999కి కొనుగోలు చేయచ్చు. ఇక్కడ వినియోగదారులకు 16 శాతం తగ్గింపు ఇస్తారు. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లపై కస్టమర్లు రూ.2,000 తగ్గింపును కూడా పొందచ్చు. అటువంటి పరిస్థితిలో వినియోగదారుల కోసం ఫోన్ ప్రభావవంతమైన ధర రూ.12,999 అవుతుంది.

ఇది మాత్రమే కాదు, కస్టమర్లు తమ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.14,999 వరకు తగ్గింపును పొందచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ట తగ్గింపును పొందాలంటే, పాత ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. ఈ ఫోన్ 12GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా వస్తుంది. ఈ వేరియంట్ సైట్‌లో రూ. 16,999కి జాబితా చేశారు. బ్యాంక్ ఆఫర్‌ను ఇక్కడ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, లిలక్,రెడ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Moto G64 5G Specifications
డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో Moto G64 5G ఆండ్రియిడ్‌లో నడుస్తుంది.  ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌తో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు కూడా పొందుతుంది. హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.5-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7025 చిప్‌తో వస్తుంది. గరిష్టంగా 12GB RAMతో జత లింకై ఉంటుంది.

మోటరోలా కొత్త Moto G64 5Gని OIS, ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF), f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది, దీనితో మీరు మాక్రో ఫోటోలు కూడా తీయచ్చు. ముందు భాగంలో ఫోన్ f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

మోటో G64 5G 256జీబీ వరకు బిల్ట్ ఇన్ వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా (1TB వరకు) విస్తరించవచ్చు. హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 33W ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.