Home / YSRCP
Chandrababu Naidu: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Ys Avinash Reddy: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది.
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టాలని అమిత్ షాకు లేఖ రాసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైకాపాకి సొంత పార్టీ నేతలే రివర్స్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో గత కొద్దిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.