Home / YSRCP
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
జగన్ పోవాలి , పవన్ రావాలి అనేది కాపు సంక్షేమ సంఘం లక్ష్యం కావాలన్నారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. ఆదివారంనాడు జరిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Naidu: యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర ఆగబోదని.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
GIS 2023: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్లో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. పర్యావరణ హితం.. పారిశ్రామిక రవాణా మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ నాలుగు రాష్ట్రానికి మూల స్తంభాల్లాంటివని అభివర్ణించారు.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Ys Avinash Reddy: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విచారణలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది.