Home / YSRCP
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అధికార వైసీపీకి షాకిచ్చారు. 2023 డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన అంబటి రాయుడు పది రోజులు కూడా తిరగకముందే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. తాను అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై చెప్పారు. జగన్‌ను నమ్మి పార్టీలోకి వచ్చానని.. నమ్మినందుకు గొంతు కోశారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. సర్వే పేరుతో టికెట్ ఇవ్వమని అనడం సరికాదని మండిపడ్డారు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాననని.. తాను రాయదుర్గం నుంచి తన భార్య కల్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు చోట్ల ఈరోజు వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "సామాజిక సాధికారిత బస్సు యాత్ర"లు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర లోని ఇచ్ఛాపురం.. కోస్తాలోని తెనాలి.. రాయలసీమలోని శింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రలో భాగంగా 53 నెలల వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి,
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్, రీజినల్ కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం,మండల స్థాయి ముఖ్య నాయకులతో కలిసి 8,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్నిఅందించారు.
ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియడం లేదు. ఇన్నాళ్ళూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్దాలు జరగడం గమనించవచ్చు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతలే విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం మత్స్యకార యవతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాగ్ నినాదాలు చేశారు.
TDP-YSRCP: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాళ్లతో అమరావతి అట్టుడుకుతోంది. ఇసుక రవాణా అవినీతిపై చర్చకు రావాలని రెండు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి.
YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద దుమారమే రేపుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. వారిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.