Last Updated:

MLA Kannababu Raju: ’గడప గడపకూ‘లో నిరసన సెగ.. పీఏ పై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు రాజు

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం మత్స్యకార యవతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాగ్‌ నినాదాలు చేశారు.

MLA Kannababu Raju: ’గడప గడపకూ‘లో నిరసన సెగ.. పీఏ పై దాడి చేసిన వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు రాజు

MLA Kannababu Raju: ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘గడప గడపకూ’కార్యక్రమానికి నిరసన సెగలు ఎదురయ్యాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. యలమంచిలి, పెనుగొండ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు పరాభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగలు ఎదురయ్యాయి. ప్రజలు , సొంత పార్టీ నేతలు అడ్డుకున్నారు.

సొంత పార్టీ నేతలే(MLA Kannababu Raju)

కార్యక్రమంలో భాగంగా యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజును సమస్యలపై స్థానికులు నిలదీశారు. అచ్చుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో కార్యక్రమంలో ఆయన నిర్వహించారు. ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్‌నాథ్‌ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఏపీఐఐసీ పైపులైన్‌ ప్యాకేజీ ఇప్పించాలని.. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

 

పీఏపై అసహనం

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం మత్స్యకార యవతకు ఉపాధి కల్పించాలంటూ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ గోబ్యాగ్‌ నినాదాలు చేశారు. సొంత పార్టీ నేతలే నిలదీయడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారిపైకి కన్నబాబురాజు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, ఈ క్రమంలో ఆయన పీఏ నవీన్‌వర్మ ఆయన చేయిపట్టుకుని వెనక్కి లాగారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే పీఏ పై దాడి చేశారు. అనంతరం పోలీసుల జోక్యం చేసుకున్నారు. నేతల నిరసనల కొనసాగుతుండగా .. కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.

 

బట్టలూడదీసి కొట్టేవాళ్లం..

మరో వైపు అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ కు నిరసన సెగలు ఎదరయ్యాయి. అంతేకాకుండా ఆయనపై దాడి జరిగింది. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి వస్తున్న శంకర్ నారాయణను ఈదుల బలాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. శంకరనారాయణ ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో వాహనాన్ని వెనక్కి తిప్పుకుని శంకరనారాయణ వెళ్లిపోవాల్సి వచ్చింది.

 

అయితే పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై దాడి చేయించింది సొంత పార్టీ నేత నాగభూషణ రెడ్డి. ఈ వ్యవహారంపై నాగభూషణ్ రెడ్డి కూడా స్పందించారు. ఈదులబలాపురం గ్రామంలో జరిగే అభివృద్ధిని శంకరనారాయణ అడ్డుకుంటున్నారన్నారు. గ్రామంలో 5 నెలల పాటు రేషన్ సరుకులు వేయలేదని మండిపడ్డారు. గ్రామస్తులు సమస్యలు చెప్పుకుంటే అవమానిస్తున్నాడని తెలిపారు. వైఎస్సార్సీపీ మీద అభిమానంతో వదిలిపెట్టామన్నారు. లేకపోతే ఎమ్మెల్యే శంకరనారాయణను బట్టలూడదీసి కొట్టేవాళ్ళమంటూ ఆయన హెచ్చరించారు.