Last Updated:

Tirumala Venkanna: తిరుమల వెంకన్నను ఏరోజు దర్శించుకోవాలి?

అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం ఎంతగానో వేచి చూస్తారు భక్తులు. ఆ దేవదేవుణ్ని ఒక క్షణం దర్శించుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు.

Tirumala Venkanna: తిరుమల వెంకన్నను ఏరోజు దర్శించుకోవాలి?

Tirumala Venkanna: అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం ఎంతగానో వేచి చూస్తారు భక్తులు. ఆ దేవదేవుణ్ని ఒక క్షణం దర్శించుకుంటే తమ జీవితం ధన్యమవుతుందని భావిస్తుంటారు. ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు శ్రీనివాసుని దర్శనం కోసం తిరుమలకు తరలి వస్తుంటారు.

ఏడు కొండలలో నెలకొన్న ఆ కోనేటి రాయుడిని దర్శన భాగ్యం కోసం ఖండాలు దాటి భక్తులు వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో ఏడుకొండల వాడిని చూసేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటారు.

 

శ్రీవారి దివ్యమంగళ రూపం కోసం(Tirumala Venkanna)

కొన్ని గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండి.. ఆ ఒక క్షణం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం భక్తులు తహతహలాడతారు.

కేవలం క్షణమైనా సరే, శ్రీవారి దర్శనం దక్కితే చాలు అనేకునే వాళ్లు ఎందరో.

ఇంతకుముందు తిరుమలకు సెలవులు వచ్చినపుడు లేదా వీకెండ్ లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. మంగళ, బుధవారాలలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తక్కువగా ఉండేది.

 

క్రమంగా పెరిగిన భక్తుల తాకిడి(Tirumala Venkanna)

మళ్లీ గురువారం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పుంజుకుని శుక్ర, శని, ఆదివారాల్లో బాగా పెరిగేది. తిరిగి సోమవారం నుంచి కాస్త తగ్గుముఖం పట్టేది.

రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రోజులతో సంబంధం లేకుండా తరలి వస్తున్నారు.

దీంతో వీకెండ్ లోనే కాకుండా.. మిగిలిన రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది.

శ్రీవారి ఆలయంలోని పరిస్థితుల కారణంగా ఏరోజు దర్శనం చేసుకుంటే, ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయన్న అంశంపై భక్తులు దృష్టి పెట్టకుండా, స్వామివారి దర్శనభాగ్యం దక్కితే చాలన్నట్లుగా

ఎప్పుడు కుదిరితే అప్పుడే భక్తులు వస్తున్నారు. అయితే, శ్రీవారిని ఏ రోజు దర్శించుకుంటే, ఎలాంటి ఫలితం లభిస్తుందో చూద్దాం.

 

ఏరోజు దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు

ఆ బ్రహ్మాండ నాయుకుడిని ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహం, ప్రభుత్వాధి నేతల దర్శనం, అధికార కార్యానుకూలత, శత్రునాశనం, నేత్ర, శిరోబాధల నుంచి ఉపశమనం లాంటి ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సోమవారం శ్రీవారిని దర్శించుకుంటే, స్త్రీ సంబంధంగా పనుల్లో సానుకూలత, తల్లికి, సోదరీమణులకు శుభం, వారి నుంచి ఆదరణ, భార్యతో అన్యోన్యత కలుగుతాయని నమ్మకం.

పౌర్ణమినాడు గరుడవాహనంపై శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వసిస్తారు.

మంగళవారం వెంకన్నను దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలలో కార్యసిద్ధి, భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి, కార్యాను కూలత కలుగుతాయి.

బుధవారం దర్శించుకుంటే విద్యాప్రాప్తి, విదేశీయానం, సామాజిక గౌరవం లభిస్తాయి.

గురువారం దర్శన భాగ్యం దగ్గితే ఉత్తమ జ్ఞానలాభం, వాక్శుద్ధి, గురువుల ఆశీస్సులు లభిస్తాయి.

శుక్రవారం దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు, వాహన సౌఖ్యం, ఇష్టకార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి.

ఇక శనివారం శ్రీవారిని దర్శించుకుంటే రుణపీడ, ఈతిబాధలు తొలగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.