Home / TDP
నంద్యాల వైకాపా శాసనసభ్యులు శిల్పా రవి పై మాజీ మంత్రి అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో పలు అంశాల పై మాట్లాడారు. వెన్నపోటు గురించి మాట్లాడడం ఎమ్మెల్యేకు తగదన్నారు. మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి రవికి లేదన్నారు.
సీఎం జగన్ కుప్పం పర్యటనపై ఇంకా రాష్ట్రంలో రాజకీయ వేడి తగ్గలేదు. కుప్పం వేదికగా మాజీ సీఎం చంద్రబాబులపై జగన్ పలు ఆరోపణలు చేసారు. చేతకాని సీఎంగా అభివర్ణించారు. దీంతో ఎదురుదాడికి తెదేపా దిగింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.
చంద్రబాబు నాయుడు 14ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేకపోయారని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.
జగన్ డైవర్షన్ పాలిటిక్స్.. టీడీపీకి జనసేన సపోర్ట్.. షాక్ లో ఏపీ ప్రభుత్వం
వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ను ఎన్నుకొంటూ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకున్న ఎన్నిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన విషయం తెలిసిందే.
ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. హెల్త్ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్ అని, వైఎస్ఆర్కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్పు పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. తెదేపా నేతలతోపాటుగా పలు అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో నిరసిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో గంధరగోళం పరిస్ధితులు ఏర్పడ్డాయి.