Home / tamil nadu
ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు ఇచ్చి సర్ ప్రైజ్ కు గురి చేశారు తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు.
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కొన్ని సంఘటనలు చూస్తే యువతరం ఎటుపోతుందో అనిపిస్తుంది. ప్రేమలు పెళ్లిళ్లు అనేవి నేటి యువతరానికి ఆశామాషీ వ్యవహారాల్లా మారిపోతున్నాయి. పాఠశాల చదువు పూర్తి కాకుండానే లవ్వులు ఏంటో.. ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? నేటి తరాన్ని చూస్తే నిజంగానే కలికాలం అనాల్సి వస్తుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓ స్కూల్ విద్యార్థినికి మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు.
దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు . తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని ఆయన స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. 5 మందిని పెళ్లాడి చివరకు కటకటాలపాలయ్యింది.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు యూనిట్ సెప్టెంబర్ 17 (శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తగా పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు మరియు 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హిందూ జనాభా అధికంగా ఉన్న ఏడు గ్రామాలను వక్ఫ్ బోర్డు తమ సొంత గ్రామాలుగా పేర్కొంది. ఇది మాత్రమే కాదు. 1500 సంవత్సరాల పురాతన దేవాలయం పై కూడా తమదే అని చెబుతోంది.