Home / T20 World Cup 2022
టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
సఫారీలు విరుచుకుపడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్ రిలీ రూసో విరోచిత సెంచరీ నమోదు చేశాడు. కేవలం 52 బంతుల్లో రూసో సెంచరీ పూర్తి చేశాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో అద్వితీయ విజయం సాధించిన టీం ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా శుభారంభం చేసింది. కాగా నేడు నెదెర్లాండ్స్ సిడ్నీ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌కు రెడీ అయింది.
టీ20 వరల్డ్ కప్ ప్రయాణంలో టీం ఇండియా విజయారంభం చేసింది. పాకిస్థాన్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫుడ్ సరిగాలేదంటూ టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త నగరం వేదికగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. కాగా లంకతో జరిగిన మ్యాచ్లో, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ పై విరాట్ కోహ్లి మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్ కొంత సమయం పాటు ఆన్‌లైన్ షాపింగ్ ను నిలిపివేసినట్లు ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ షేర్ చేసిన గ్రాఫ్ తెలిపింది.
ఆదివారం నాడు దాయాదీపోరులో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జట్టును మరియు విరాట్ కొహ్లీని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత జట్టు సమరం ప్రారంభమయ్యింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు భారత్ ముచ్చమటలు పట్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది పాక్.
టీ20 వరల్డ్ కప్ 2022 పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది. సూపర్-12 రౌండ్ మ్యాచ్లు ఈ రోజు నుంచి ప్రారంభం అవనున్నాయి. గత ఏడాది టీ 20 ప్రపంచ కప్‌లో ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ రౌండ్ ప్రారంభమవుతుంది.