Home / Rahul Gandhi
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. నేడు ఏపీలోకి ఈ యాత్ర ప్రవేశించింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో నేడు మొదలైన రాహుల్ పాదయాత్ర ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది.
దేశంలోనే అత్యంత అవినీతిమయమైన కర్ణాటక ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కర్ణాటక సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు
నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే..
ప్రపంచంలో ప్రాణం ఉన్న జీవి ఏదైనా. తల్లి ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. మాధుర్యాన్ని తెలియచేసే తల్లి ప్రేమపై రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది
2024 పార్లమెంటు ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే, వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీనియర్ నేతలు జైరాం రమేష్ పేర్కొన్నారు
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూర్ చేరుకున్నారు.
మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో మొదలుకానుంది. దీనికి సంబంధించి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు.