Home / Rahul Gandhi
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో మొదలుకానుంది. దీనికి సంబంధించి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేశారు.
రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు
భారత్ జోడో యాత్రను తలపెట్టిన కాంగ్రెస్ ను అడ్డుకొనేందుకు అధికార భాజాపా శ్రేణులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అక్టోబర్ 1న రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించనున్న నేపథ్యంలో స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను భాజాపానే చింపేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 18వ రోజుకు చేరింది. ఈ నెల 10న కేరళలో ప్రవేశించిన రాహుల్ పాద యాత్ర నేడు వాయనాడ్ నియోజకవర్గంలో ప్రవేశించింది. కేరళలో రాహుల్ పాదయాత్ర 450 కి.మీమేర సాగనుంది
కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర 17వ రోజుకు చేరుకొనింది. ఈ నెల 30న కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనున్న నేపధ్యంలో కర్ణాటక పిసిసి తగిన ఏర్పాట్లు చేసింది. కర్ణాటకలో చేపట్టే జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు పాల్గొననున్నారు
గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి పార్టీ అధ్యక్షుడు కాకూడదని పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ఫష్టం
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరదపవార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని, 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి జోడో యాత్ర ప్రయోజనంగా మారుతుందని తెలిపారు.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తన భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు ఆహ్వానం పంపించారు. బీహార్లోని కాంగ్రెస్ నాయకులు ఆదివారం తేజస్విని అతని తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్ మరియు రబ్రీ దేవిలను కలుసుకున్నారు
కాంగ్రెస్ లేకుండా భాజాపా వ్యతిరేక ఫ్రంట్ వైపు ఊవిర్ళూలుతున్న ప్రతిపక్ష పార్టీలంతా మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్నారని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆయన పిటిఐ వార్త సంస్ధతో పలు విషయాలు తెలియచేశారు