Home / Odisha
మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని కలహండి జిల్లాలో రాష్ట్ర నిఘా విభాగం (ఎస్‌ఐడబ్ల్యూ) భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) ర్యాంక్ అధికారి గాయపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఇద్దరు మైనర్ పిల్లలకు 'దుష్టశక్తులను దూరం చేసేందుకు' వీధికుక్కలతో పెళ్లి చేశారు. 11 ఏళ్ల బాలుడు, తపన్ సింగ్ (దారీ సింగ్ కుమారుడు) ఆడ కుక్కను వివాహం చేసుకోగా, ఏడేళ్ల లక్ష్మి (బుటు కుమార్తె) ఒక మగ కుక్కతో వివాహం చేసుకుంది.
ఒడిశాలో జనవరి మరియు ఫిబ్రవరిలో సేకరించిన 225 నమూనాలలో 59 H3N2 ఇన్ఫ్లుఎంజాకు పాజిటివ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. H3N2 అనేదిఇన్ఫ్లుఎంజా వైరస్, ఇది సాధారణంగా పందులలో వ్యాపించి మానవులకు సోకుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్‌లోని గాంధీ చౌక్ వద్ద మంత్రి నబకిశోర్‌దాస్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.
Gajarla Ravi: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ టార్గెట్ చేసింది. గాజర్ల రవి ఆచుకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. గాజర్ల రవి.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందినవాడు.
Hockey: హకీ.. ఇప్పుడు స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతున్నా పెద్దగా ఎవరికి తెలియదు. జాతీయ క్రీడా అయినప్పటికి క్రికెట్ కు ఉన్న ఆదరణ ఈ ఆటకు లేదు. కానీ మన దేశంలో జరుగుతున్న హకీ ప్రపంచకప్ లో మన ఆటగాళ్లు ఎక్కడున్నారు.. మన స్థానం ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో కీలక దశకు చేరుకుంది. పూల్ దశలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా.. న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో […]
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్‌గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.
పూరీ శ్రీ జగన్నాథ దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బెంగాలీ యూట్యూబర్ అనిమేష్ చక్రవర్తిపై కేసు నమోదయింది.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
ఒడిశాలోని ఒక వ్యక్తి తన భార్య అనుమతితో ట్రాన్స్ జెండర్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతనిభార్యవారి వివాహాన్ని అంగీకరించడమే కాకుండా, ఒకే ఇంట్లో కలిసి ఉండటానికి అంగీకరించింది.