Bipin Rawat: అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి బిపిన్ రావత్ పేరు
అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ 'జనరల్ బిపిన్ రావత్ మార్గ్'గా అంకితం చేశారు.
Bipin Rawat : అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితు సైనికశిబిరానికి భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దివంగత జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్ గా పేరు పెట్టారు. శనివారం జరిగిన కార్యక్రమంలో, స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గ్రాండ్ గేట్ ను ఆవిష్కరించారు. వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ పొడవైన రహదారిని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పెమా ఖండూ ‘జనరల్ బిపిన్ రావత్ మార్గ్’గా అంకితం చేశారు.
దివంగత జనరల్ బిపిన్ రావత్ 1999-2000 వరకు కిబితులో కల్నల్‌గా తన బెటాలియన్ 5/11 గూర్ఖా రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. ‘జనరల్ బిపిన్ రావత్ ఈ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఎంతో కృషి చేశారు. స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక వృద్ధిని అమలు చేయడంలో అతని దార్శనికత మరియు దూరదృష్టి కీలక పాత్ర పోషించాయి’ అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో , జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఈస్టర్న్ కమాండ్, సీనియర్ మిలిటరీ మరియు సివిలియన్ ప్రముఖులు మరియు జనరల్ బిపిన్ రావత్ కుమార్తెలు పాల్గొన్నారు.