Home / latest Telangana news
సీఎంగా కేసీఆర్ హ్యాటిక్ కొడితే.. ఎన్టీఆర్ ఆత్మ కూడా శాంతిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ తాజాగా ప్రారంభించారు. అలాగే లకారం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
విశాఖ ఇండస్ట్రీకు ఆరు వారాల్లోపు 17కోట్ల 50 లక్షలు చెల్లించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కి హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి 2004లో బ్యాంకు లోన్ తెచ్చి విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ - విశాఖ ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌ను హెచ్‌సీఏ క్యాన్సిల్ చేసింది.
ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా హైదరాబాద్ నగరంలో
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, యాకత్పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు
హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఓవైసీ నోరు అదుపులోకి పెట్టుకోకుంటే పార్లమెంటులో అసదుద్దీన్ ఓవైసీపై మూకదాడి జరగడం ఖాయమని హెచ్చరించారు. నీకు దమ్ముంటే నా నియోజకవర్గం గోషా మహల్నుంచి పోటీ చేయి అని ఓవైసీకి రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరిని తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై అంగీకరించలేదు.
ముఖ్యమంత్రి కేసిఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని, ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కాంగ్రెస్ సీనియర్ నేతలు చేరుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఇతర అంశాలపై ఆయనతో సీనియర్లు చర్చించనున్నారు. ఇప్పటికే మైనంపల్లి ఇంటికి దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, మల్కాజ్ గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేరుకున్నారు.
మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్‌లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది.
తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలవైపు కేంద్రీకృతమైందని వాతావరణ వెల్లడించింది. ఈ అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో