Home / latest Telangana news
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరులకు ముందుగా వందనం చేశారు. రజాకార్లపై పోరాడి అమరులయిన వారికి నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ముందుగా సీఎం కేసీఆర్.. మోటర్లను ఆన్ చేసి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు.
: ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది.
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 8మంది నిందితులని పోలీసులు రిమాండుకి తరలించారు. వీరిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజీరియా దేశస్తులని అదుపులోకి తీసుకున్నాం పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు.. 16వ తేదీ రాత్రికే రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 7గంటల 20 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో నవదీప్ ఉన్నారని అన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను అదుపులోకి తీసుకున్నామని అతని ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసామని చెప్పారు.
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.
టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.
సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.