Home / latest national news
సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జైలర్". ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరియు సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మంగళవారం మరణించారు. 80 ఏళ్ల పాఠక్ భారతదేశంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంలో పలువురికి మార్గదర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం జాతీయ జెండాను ఎగురవేసిన పాఠక్ ఆ వెంటనే కుప్పకూలిపోయాడని సన్నిహితుడు తెలిపారు.
జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక హిందీ చిత్రం ప్రదర్శించబడుతోంది.గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించాలని ప్లాన్ చేసింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం వెల్లడించలేదు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన కెనడా పాస్‌పోర్ట్‌ను అధికారికంగా వదులుకుని ఆగస్టు 15, 2023న తన భారత పౌరసత్వాన్ని తిరిగి పొందాడు. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తన భారత పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఫోటోను అతను ట్విట్టర్లో షేర్ చేసాడు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు , 642 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకే రోజు 18 మరణించడం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా ఇంత మంది చనిపోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా శివాలయం కూలిపోవడంతో కనీసం తొమ్మిది మంది మరణించారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు.కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు చిక్కుకున్నారని, పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ సంవత్సరం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,800 మంది 'ప్రత్యేక అతిథులు' పాల్గొంటారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వీరిని ఆహ్వానించారు.
తన భారతీయ ప్రేమికుడితో కలిసి ఉండటానికి సరిహద్దులు దాటిన పాకిస్థానీకి చెందిన సీమా హైదర్‌కు రాజ్ ఠాక్రే యొక్క మహారాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన ఒక నాయకుడువార్నింగ్ ఇచ్చారు. సీమా హైదర్ కధను తెరకెక్కించడాన్ని ఆపాలని లేకపోతే తీవ్ర పరిణాములు ఉంటాయని హెచ్చరించారు.
హర్యానాలో హిందూ సమూహం సభకు అనుమతి కోసం ద్వేషపూరిత ప్రసంగం చేయవద్దు" షరతు ఉన్నప్పటికీ, కొంతమంది వక్తలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడవద్దని స్పీకర్లను హెచ్చరించారని నిర్వాహకులు పేర్కొన్నారు, అయితే కొందరు వక్తలు దానిని పట్టించుకోలేదు. ‘వేలు ఎత్తితే చేతులు నరికేస్తాం’ అని ఒకరు పేర్కొనగా మరొకరు రైఫిళ్లకు లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.