Home / latest national news
:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం పూంచ్ జిల్లాలోని ఓ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ముఫ్తీ ఆలయ సందర్శనను భారతీయ జనతా పార్టీ "రాజకీయ జిమ్మిక్"గా అభివర్ణించింది.
ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజా అవినీతి కేసును నమోదు చేసింది.
మద్యపాన నిషేథం అమల్లో ఉన్న బీహార్‌లో ఒక దినసరి కార్మికుడికి ఇవ్వాల్సిన వేతనంగా రెండు మద్యం సీసాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే తమిళ డాక్యుమెంటరీ 95వ అకాడమీ అవార్డ్స్‌లో విజేతగా నిలిచింది, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో భారతదేశానికి ఇది తొలి విజయంగా నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
గృహహింసకు గురైన వివాహిత మగవారి ఆత్మహత్యలను ఎదుర్కోవటానికి మార్గదర్శకాలను మరియు 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్'ని కోరుతూ భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది.
పాండిచ్చేరిలో మార్చి 11 వరకు 79 ఇన్ ఫ్లుయెంజా కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో మరణాలు మాత్రం చోటు చేసుకోలేదు.
మహారాష్ట్రలో H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకి 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. సమాచారం మేరకు మృతుడు అహ్మద్‌నగర్‌లోని ఓ కళాశాలలో మెడిసిన్ చదువుతున్నాడు. గత వారం, అతను స్నేహితులతో కలిసి కొంకణ్‌లోని అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లాడు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తె డాక్టర్ మిసా భారతికి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు లాండ్స్ ఫర్ జాబ్స్ కేసులో బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల కాలంలో తరచుగా విమానాలలో మూత్రవిసర్జన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ట్రైన్ లో టీటీఈ మద్యం మత్తులో మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమృత్సర్-కోల్‌కతా అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగింది.
ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి మహిళగా నిలిచారు.సోమవారం ముంబైలోని షోలాపూర్ స్టేషన్ మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) మధ్య సెమీ-హై స్పీడ్ రైలును ఆమె నడిపారు