Last Updated:

Indore Temple: ఇండోర్ ఆలయంలో అక్రమనిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన అధికారులు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి అక్రమ నిర్మాణాలను సోమవారం బుల్డోజర్లతో కూల్చివేసారు. శ్రీరామనవమి సందర్బంగా ఇక్కడ మెట్ల బావి కూలి 36 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనితో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు సోమవారం ఉదయం పెద్దఎత్తున మున్సిపల్‌, పోలీసు అధికారులు ఆలయానికి చేరుకున్నారు.

Indore Temple: ఇండోర్ ఆలయంలో అక్రమనిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన అధికారులు

Indore Temple: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి అక్రమ నిర్మాణాలను సోమవారం బుల్డోజర్లతో కూల్చివేసారు. శ్రీరామనవమి సందర్బంగా ఇక్కడ మెట్ల బావి కూలి 36 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనితో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టేందుకు సోమవారం ఉదయం పెద్దఎత్తున మున్సిపల్‌, పోలీసు అధికారులు ఆలయానికి చేరుకున్నారు.

నాలుగు పోలీసు స్టేషన్ల సిబ్బందిని,డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ మరియు ఇతర అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉన్నారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ గత సంవత్సరం మెట్ల బావిని కూల్చివేయాలని గుర్తించింది, అయితే మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్ట్ హెచ్చరించడంతో వారు వెనక్కి తగ్గారు.రామ నవమి రోజున జనం రద్దీకి మెట్ల బావి పైకప్పు విరిగిపోయింది.

పురాతన బావులు, బోరు బావులపై మార్గదర్శకాలు..(Indore Temple)

ఆదివారం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాస కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. సాంప్రదాయ పురాతన బావులు మరియు మెట్ల బావులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని వారికి సూచించారు. పూడ్చకుండా మూతపడిన బావులు, మెట్ల బావుల పట్ల ప్రత్యేక అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాంటి స్థలం ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే, అటువంటి ప్రదేశాల చుట్టూ సరిహద్దు గోడలు, ఫెన్సింగ్ లేదా రైలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బావులు మరియు మెట్ల బావుల గురించి స్థానిక పెద్దల నుండి కూడా సమాచారం పొందాలి. ఇండోర్ లాంటి ఘటన రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకోవాలి.

తెరిచిన బోరుబావులపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఉన్న బోర్లను గుర్తించాలి. ప్రభుత్వ భూమిలో బోరు తెరిచి ఉంటే సంబంధిత అధికారి-ఉద్యోగిపై, ప్రైవేట్ భూమిలో బోరు తెరిచి ఉంటే సంబంధిత భూ యజమానిపై చర్యలు తీసుకోవాలి.ఈ ఆదేశాల నేపధ్యంలో ఇండోర్ జిల్లా పరిపాలనా యంత్రాంగం సెక్షన్ 144 ప్రకారం అన్ని మెట్ల బావులను ఆక్రమణల నుంచి తొలగించడానికి ఒక ఉత్తర్వును జారీ చేసింది.