Home / latest national news
‘ది కేరళ స్టోరీ’ ( The Kerala Story Movie ) సినిమాపై వాహకిన వివాదాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మే 5న విడుదల అయిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేరళలో అధికార, పలు విపక్ష పార్టీలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్
: మణిపూర్‌లో చెలరేగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 55 కి చేరింది. , అయితే రెండు రోజుల హింసాకాండ తరువాత, కొన్ని ప్రాంతాలు సాధారణ స్థితికి వచ్చాయి. అయినప్పటికీ సాయుధ దళాల పహరా కొనసాగుతోంది.
ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమక్షంలో సూచించారు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాపై వెనక్కి తగ్గారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల కమిటీ తీర్మానం మేరకు ఆయన వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు
‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ఇస్లాం మతానికి విరుద్ధంగా ఏముందని, విడుదలను నిలిపివేయాలని కోరుతున్నారని పిటిషనర్లను కేరళ హైకోర్టు ప్రశ్నించింది. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలయింది.
ఘన మరియు ద్రవ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బీహార్ కు రూ.4,000 కోట్ల జరిమానా విధించింది.ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా రింగ్ఫెన్స్డ్ ఖాతాలో జమ చేయాలని, రాష్ట్రంలోని వ్యర్థాల నిర్వహణ కోసం మాత్రమే ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం నిర్వహించాలని చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ తన పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న రెండు రోజుల తరువాత, శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన 18 మంది సభ్యుల కమిటీ అతని రాజీనామాను తిరస్కరించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. చమోలి జిల్లాలోని హెలాంగ్ గ్రామం సమీపంలో కొండపై నుంచి భారీగా చెత్తాచెదారం రావడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని అడ్డుకున్నారు.
ఢిల్లీలోని ఓ నర్సింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను దొంగతనం చేశారనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ వారి బట్టలు విప్పించి వేధింపులకు గురిచేసినట్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
బీహార్‌లో కుల ఆధారిత జనాభా గణనపై పాట్నా హైకోర్టు గురువారం స్టే విధించింది. రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని బీహార్ ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ జనాభా లెక్కలను వ్యతిరేకించింది.