Home / latest international news
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన వెంటనే ముస్లిం దేశాలన్నీ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. తాజాగా వారి సరసన మాల్దీవ్స్‌కూడా జత చేరింది. ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించమని తేల్చేసింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా గట్టిగానే స్పందించింది. తమ పౌరులను మాల్దీవ్స్ బదులు ఇండియాలోని లక్ష్యదీప్కు వెళ్లాలని సూచించింది.
కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబా తన పాప్ సాంగ్స్‌తో 2009 నుంచి యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. 16 ఏళ్ల అతి చిన్న వయసులో మంచి పాప్ సింగర్‌గా పేరు సంపాదించుకున్నాడు.
ఎర్ర సముద్రం చుట్టు పక్కల హౌతీ రెబెల్స్ దారుణాలకు అంతే లేకుండా పోయింది. ఆ మార్గం గుండా ప్రయాణించే సరకు రవాణా నౌకలను హైజాక్ చేసి తీసుకెళ్లిన ఘటనలు కొకొల్లలు. ఇండియాకు చెందిన నౌకలను కూడా హైజాక్ చేసిన విషయం తెలిసిందే.
మాజీ అమెరికాప్రెసిడెంట్ చిక్కుల్లో పడ్డారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటిసారి ఓ దేశాధ్యక్షుడు చేసిన నేరానికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు డొనాల్డ్ ట్రంప్. న్యూయార్కు కోర్టు ఆయనను 34 కౌంట్లలో దోషిగా నిర్ధారించింది.
మన దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు అబద్దాలు వల్లె వేస్తోంది తప్ప.. వాస్తవాలు మాత్రం చచ్చినా చెప్పదు. తిమ్మిన బమ్మిన చేయడంలో సిద్దహస్తురాలు. మరి అలాంటి పాక్‌కు మరి ఎందుకో జ్ఞానోదయం కలిగి చేసిన తప్పును ఒప్పకోవడం విశేషం. 1999లో ఇండియాతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందన్న చేదు నిజాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బట్టబయలు చేశారు.
గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న కాల్పులు, వైమానిక దాడులతో 37 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది గుడారాలలో ఆశ్రయం పొందారు, రఫా యొక్క పశ్చిమ టెల్ అల్-సుల్తాన్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపారు.
పాకిస్తాన్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. విద్యుత్ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
పవువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడి సుమారు 2,000 మంది కంటే ఎక్కువ మంది మట్టి పెళ్లలో కూరుకుపోయారని అక్కడి జాతీయ విపత్తు కార్యాలయం వెల్లడించింది. అయితే రెస్క్యూ వర్కర్స్ మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని బయటికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పపువా న్యూ గినియాలో కొండచరియలు విరగిపడి సుమారు 300 మంది సమాధి అయినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాగా రెస్యూ వర్కర్లు మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
బ్రిటన్‌లో జూలై 4న జనరల్ ఎలక్షన్స్ జరుగనున్నాయి. ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం నాడు ఎన్నికల తేదీని ప్రకటించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.