Home / latest international news
కెన్యాలో మంగళవారం జరిగిన నిరసనల్లో కనీసం 13 మంది మరణించారని ఆ దేశ ప్రధాన వైద్యుల సంఘం అధికారి తెలిపారు.నైరోబీ మరియు దేశంలోని ఇతర నగరాల్లో పోలీసులు మరియు నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల మధ్య కెన్యా పార్లమెంటు మంగళవారం పన్నులను పెంచే వివాదాస్పద ఆర్థిక బిల్లును ఆమోదించింది.
ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాషింగ్టన్‌లోని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆరడుగుల మైనపు విగ్రహం కరిగిపోయింది. క్యాంప్ బార్కర్ లో ఉన్న ఈ విగ్రహం తల ఎండ వేడికి ముందుగా విగ్రహం తల, తరువాత కాళ్లు కరిగిపోయాయి.
బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో 15 మందికి పైగా పోలీసు అధికారులు, మతగురువుతో సహా పలువురు పౌరులు సాయుధ మిలిటెంట్ల చేతిలో హతమయ్యారు. ముష్కరులు రెండు నగరాల్లోని రెండు చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ఒక పోలీసు పోస్ట్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ కొరియాను కవ్విస్తోంది ఉత్తర కొరియా. డీమిలిటరైజ్డ్ జోన్ ను దాటి దక్షిణ కొరియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. దీన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే వారిని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు కూడా జరిపింది.
చైనా దాదాగిరి రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా సమయంలో భారత్ సరిహద్దులోని గల్వాన్ లోయలో అక్రమ కట్టడాలు కట్టడాన్ని ఇండియా వ్యతిరేకించడంతో మొదలైన బాహాబాహీలో ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు.
బ్రిటన్‌లో అత్యంత సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచింది హిందూజా కుటుంబం. ఇండియాకు చెందిన వీరు బ్రిటన్‌లో స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వీరికి వ్యాపారాలున్నాయి. అయితే ఇటీవల హిందూజా గ్రూపుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కా మదీనాలో పరిస్థితులు ఈ ఏడాది దారుణంగా తయారయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ముస్లింలు ఈద్ -అల్ అదా .. లేదా బక్రీద్ జరుపుకున్నారు. అయితే ఈద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం మక్కాను దర్శించుకున్నారు.
ఇటలీలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సమావేశమయ్యారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కలిశారు.