Home / latest ap political news
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు (సోమవారం) కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అమిత్ షా, నడ్డాలతో పాటు పలువురు బీజేపీ
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత హీట్ పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న క్రమంలో మాటల యుద్దానికి తెరలేపుతూ వారి వారి శైలిలో దూసుకుపోతున్నారు. ఇన్నాళ్ళూ ఎక్కువ సందర్భాలలో మాటలు, తక్కువ సమయాల్లో మాత్రమే గొడవలు,దాడులు చేసుకోవడం గమనించవచ్చు. అయితే ఇప్పుడు పార్టీల కోసం ప్రజలు లైన్ దాటేస్తునానరని అనిపిస్తుంది.
నెల్లూరు జిల్లాలో రాజకీయం రోజురోజుకీ హీట్ ఎక్కుతుంది. నిన్నటి వరకు మేకపాటి, వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు, మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వైకాపా నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని వదిలేసినోళ్లకు మేమెంత అంటూ.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన మేకపాటి. అలానే వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు.
ఏపీలో రాజకీయాలు విమర్శలు.. ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మొదలైన ఈ ధోరణి.. ఇటీవల 4 వైకాపా ఏమమెలఎఎలను సస్పెండ్ చేయడంతో మరింత జోరందుకుంది. కాగా తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తాడేపల్లి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీదేవి మాట్లాడారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత గూటి పక్షులే సీఎం జగన్ కి రివర్స్ అయ్యి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జగన్ కి కాంతి మీద ఆకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకు గాను క్రాస్ ఓటింగ్ చేసిన వైకప ఎమ్మెల్యే లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Mekapati Chandrashekar Reddy : వైకాపా నుంచి తనను సస్పెండ్ చేయటంతో తలపై భారం తొలగినట్లైందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. అధికారం ఉందన్న అహంకారంతోనే తనను పార్టీ నుంచి తొలగించారని ముఖ్యమంత్రి జగన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీలో పరిస్థితి పైకి కనిపిస్తున్నంత సవ్యంగా లేదని, కొద్ది మంది పెత్తనమే నడుస్తోందని ధ్వజమెత్తారు. ‘నేను వేసిన ఓటుతోనే జయమంగళ వెంకటరమణ గెలిచారు. ఈ విషయంపై దేవుడిపై ప్రమాణం చేస్తా.. […]
వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.