Youth dies in waterfalls: వాటర్ ఫాల్స్ లో పడి ముగ్గురుయువకుల మృతి
ఈ మధ్య విహార యాత్రలు విషాదంగా మారడం జరుగుతూవున్నాయి .అట విడుపు కోసం నదులు,సముద్రాలూ,జలపాతాలలో స్నానానికి వెళ్లి మృత్య వడిలోకి జారుకుంటున్నారు .తాజాగా విజయ నగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద ముగ్గురు యువకులు వాటర్ ఫాల్స్ లో పడి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
Youth dies in waterfalls: ఈ మధ్య విహార యాత్రలు విషాదంగా మారడం జరుగుతూవున్నాయి .అట విడుపు కోసం నదులు,సముద్రాలూ,జలపాతాలలో స్నానానికి వెళ్లి మృత్య వడిలోకి జారుకుంటున్నారు .తాజాగా విజయ నగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద ముగ్గురు యువకులు వాటర్ ఫాల్స్ లో పడి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది .ఇప్పటి వరుకు రెండు మృత దేహాలు ఆచూకీ లభ్యం అయ్యాయి . మూడో బాడీ కోసం గాలింపు కొనసాగుతోంది.
కొనసాగుతున్న గాలింపు..(Youth dies in waterfalls)
మంగళవారం తెల్లవారుజామున విజయనగరానికి చెందిన ఆరుగురు యువకులు… జాగరం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకుని స్నానం చేస్తుండగా, ఒక యువకుడు ముందుగా నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి వెళ్లిన మరో యువకుడు కూడా నీటిలో మునిగిపోయాడు. మరో ఇద్దరు మునిగిపోతుండగా.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న మరో వ్యక్తి బయటకు వచ్చి అరిచి, చివరికి నీటిలోకి వెళ్ళాడు. అతడు కూడా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ ఐ వీరబాబు ఆధ్వర్యంలో యువకుల కోసం గాలింపు కొనసాగించింది . ఎస్. కోట పైర్ సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గన్నారు. గల్లంతైన యువకల కోసం ఎపిఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు విశాఖపట్నం నుండి సంఘటనా స్థలాకి చేరుకన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం కంటోన్మెంట్ కి చెందిన ముస్లిం యువకలు , మొత్తం ఆరుగురు స్నానం చేయడాకి నీటిలో దిగారని తెలుస్తోంది . మహమ్మద్ రజాక్ (13), మహమ్మద్ షాహిద్ ఖాన్(17), మహమ్మద్ ఆశ్రీఫ్ (16) మరణించినట్లు తెలుస్తోంది