Home / kcr
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకి వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ క్యాడర్‌తో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు. ఫిబ్రవరి నెలనుంచి కేసీఆర్ ప్రతిరోజూ తెలంగాణ భవన్‌కి ప్రతిరోజూ వచ్చి కార్యకర్తలని కలుస్తారని హరీష్ రావు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. బేగంపేట విమానాశ్రయం నుంచి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు.
పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
ఆదివారం ఖమ్మంలోనిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. పువ్వాడ ఇప్పటివరకు 4 పార్టీలు మారారని ఆయన తండ్రిని అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. తాను సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీచేస్తానని అన్నారు. గతంలో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తనపై పోటీకి రాలేదు కాబట్టే నేను సిద్ధం అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి నేతలు వస్తున్న సందర్భంగా బాణసంచా పేల్చారు.