Home / Karnataka
కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా 'PayCM' పోస్టర్లను ఏర్పాటు చేసింది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) సుమారు 700 వర్షపు నీటి కాలువల పై వివిఐపి ఆక్రమణదారుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెక్ పార్కులు, హై ప్రొఫైల్ బిల్డర్లు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు డెవలపర్లు ఉన్నారు.
బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఉద్దేశించి కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక సంచలన వ్యాఖ్యలు చేసారు. 30కి పైగా ఐటీ కంపెనీలు మురికినీటి కాలువలను ఆక్రమించుకున్నాయని అన్నారు. ధనికులైనా పేదవారైనా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలని మేము మా అధికారులను కోరాము.
బెంగుళూరులో భారీ వరదల కారణంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. డాక్టర్ గోవింద్ నందకుమార్, గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ మణిపాల్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సర్జాపూర్-మరాతహళ్లి మార్గంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. తన ప్రయాణంలో, అతను తన వాహనం నుండి దిగి, పరిగెత్తాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.
ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు.
భారతదేశం సిలికాన్ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు నగరం దేశంలోని ప్రముఖ సమాచార సాంకేతిక ఎగుమతిదారుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరం, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమయింది.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉమేష్ బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలోని టాయిలెట్లో కుప్పకూలిపోయాడు.
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.