Home / Janasena
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు.
గన్ మాట పవన్ నోట, అవును మీరు వింటున్నది నిజమే. విజయనగరం నుంచి కొత్త నినాదం అందుకున్నారు జన సేనాని పవన్ కల్యాణ్. ఏంటా కొత్త నినాదం. అది పవన్‌కు వర్కవుట్ అవుతుందా? జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.
ప్రధాని నరేంద్రమోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏకాంత భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ సాగరతీరాన జరిగిన ఈ సమావేశం, ఏపీలో అనేక రాజకీయ మార్పులకు దారి తీసే అవకాశం ఉందా? పవన్‌ను పిలిపించుకొని మరీ ప్రధాని మాట్లాడటం దేనికి సంకేతం? ఈ భేటీతో పవన్ ఇమేజిని మోదీ అమాంతం పెంచేశారా?
విశాఖ ఋషికొండ బీచ్ కు చేరుకొని నడక సాగిస్తూ ఋషికొండ లో తవ్విన కొండను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు.రిషికొండ ను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశాఖపట్నం పర్యటన లో భాగంగా శనివారం సాయంత్రం రుషికొండ ను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచి కొండపై జరుగుతున్న పనులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం. కాగా అందరిలో మోడీ , పవన్ తో ఏం మాట్లాడారు? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. మరిప్పుడు ఇవే సమస్యలు ఇప్పుడు మోదీ ముందు ఉంచారా?
ఏపీలో రోజురోజుకు జనసేనాని బలం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని సర్వేలు. ఇటీవల ఎవరి ఎదుగుదల ఎంత అనేదానిపై వైసీపీ, తెదేపా పార్టీలు సర్వేలు నిర్వహించగా వీటిలో ఏపీలో జనసేన దూసుకుపోతోందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.