Home / janasena chief pawan kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజుసమీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇంచార్జ్‌లతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఇంచార్జ్‌ల అభిప్రాయాలని తెలుసుకున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపటినుంచి నాలుగు రోజులపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తరువాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రైమ్ 9 న్యూస్ ఛానెల్ ఛైర్మన్ శ్రీ బండి శ్రీనివాస రఘువీర్, సీఈవో శ్రీ పైడికొండల వెంకటేశ్వరరావు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జనసేనాని దృష్టికి పలు విషయాలను వారు తీసుకువెళ్లారు. తాజా పరిణామలపై చర్చించారు.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్దిక ఇబ్బందులపై ప్రభుత్వం మానవతా ధృక్పధంతో స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిక్కులేకుండా మారిందని దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ముఖ్యనేతలతో సమావేశమయి వారికి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కులం, మతాన్ని దాటి వచ్చానని మానవత్వాన్ని నమ్మానని అన్నారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లుగానే సినిమాలు రాజకీయాలు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ పెరగడంతో పవన్ పూర్తిగా పొలిటికల్ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల నవంబర్ 19న వైజాగ్ హార్బర్ లో పెను
నేను ఎప్పుడూ మిమల్ని ఓటు బ్యాంకుగా చూడలేదు. మీ కష్టాల్లో నేను ఉన్నాను. మీకు అండగా నిలబడతాను అంటూ విశాఖ మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, నష్టపోయిన మత్స్యకారులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ప్రసంగింమచారు.