Home / janasena chief pawan kalyan
ఆంధప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ .. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
పొత్తులపై తాము ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని ప్రజలకే చెబుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తాం.. ఎవరితో పొత్తు పెట్టుకుంటామనేది మీకు అనవసరమని వైసీపీ నేతలకు పరోక్షంగా సెటైర్లు వేసారు.
దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి ఊరేగింపులు చేస్తారు వైసీపీ నేతలు అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేడు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో
జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని.. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన - తెదేపా ప్రభుత్వం రాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నేడు నాలుగో దశ యాత్రలో భాగంగా పెడనలో బహిరంగసభలో పవన్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
కృష్ణా జిల్లా పెడన వారాహి యాత్ర సభలో అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాళ్ళ దాడి చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పారు కదా.? దీనికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అని నోటీసుల్లో ప్రశ్నించారు. ఆధారాలుంటే ఇచ్చి పోలీసులకి సహకరించాలని పోలీసులు కోరారు.