Home / International News
కొన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగిన రెడ్డీస్ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు వచ్చాయని వ్యాపార వర్గాలు తెలిపారు. 2022-23 ఏడాదిలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రూ.1,113 కోట్ల నికర లాభాన్ని గడిచింనట్టు ప్రకటించింది.
ప్రపంచంలో ఏదో మూలన ఏదో ఒక నేరవార్తలను రోజు వింటూనే ఉంటుంటాం. ఈ క్రమంలోనే అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంట్లో ఎనిమిది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కాగా వారిలో ఆరుగురు చిన్నారులు ఉండటం తీవ్ర విషాదం.
బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇప్పుడు పెద్దపెద్ద స్క్రీన్ టీవీలు ఆవిషృతం అవుతున్నాయి. ఎంత పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తే అంత మంచి విజువల్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటి కాలం ప్రజలు నమ్ముతున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ కంపెనీ ఆలోచించింది. స్టాంప్ సైజ్ పరిమాణంలో ఉన్న అతి చిన్న టీవీలకు రూపకల్పన చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.
యూరప్‌లో మరోమారు కరోనా -19 పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెంన్షన్ కంట్రోల్ తమ పౌరులను హెచ్చరించింది.
స్పానిష్ ఫ్యాషన్ రిటైలర్ జరా చిక్కుల్లో పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియం బ్రాండ్‌గా పేరు పడ్డ జరా ఫ్యాషన్ ప్రొడక్టులు ఇజ్రాయల్‌లో బాయ్‌కాట్ కు పిలుపుకు గురైంది.
ఇటీవల ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ సాధించిన విజయంతో ఆ పార్టీ ముందస్తు ఎన్నికల నినాదాన్ని భుజాలపై ఎత్తుకొనింది. దీని కోసం లాంగ్ మార్చ్ ను నేడు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. లాహోర్ నుండి ఇస్లామాబాద్ కు సాగే 380కి.మీ లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను ఎట్టకేలకు సొంతచేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చల అనంతరం డీల్ గురువారంతో పూర్తయింది. 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. అయితే ముందునుంచి అనుకుంటున్నట్టుగానే వచ్చీరాగానే మస్క్ తనను తప్పుదారి పట్టించాడని ఆరోపించిన కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను మరియు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను బాధ్యతల నుంచి తప్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం సురక్షితమైంది, ఏ ఏ దేశాల్లో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుపుతూ గ్లోబల్ అనలిటిక్స్ సంస్ధ గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ ను విడుదల చేసింది. జాబితాలో 96 పాయింట్లు సాధిస్తూ సింగపూర్ తొలి స్థానంలో నిలబడింది. భారత దేశం 80 పాయింట్ల సాధించి 60వ ర్యాంకులో నిలిచింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నిజమైన ప్రపంచ ఇంధన సంక్షోభం" మధ్యలో ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (IEA) హెచ్చరించింది.