Home / International News
తొమ్మిది రోజుల పాటు భూగర్భంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు కూలిపోయిన షాఫ్ట్ సీలింగ్ నుండి పడే కాఫీ పౌడర్ మరియు నీటితో బతికి బయటపడ్డారు.
ఒక తల్లి సరోగేట్‌గా మారి, యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటాహ్‌లో తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చింది. జెఫ్ హాక్ అనే వ్యక్తి తన భార్య గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చిన తర్వాత పలు ఎంపికలను పరిశీలించారు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు.
తనపై దాడి జరుగుతుందని ముందే తెలుసని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచల కామెంట్స్ చేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆయన ఆరోపించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. గురువారం అయోవాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్ కు గురువారం అనుకోని అతిథి వచ్చారు. స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్ రెస్టారెంట్‌ని సందర్శించి వారి ప్రసిద్ధ వంటకాలైన మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీని ప్రయత్నించారు. ఈ విషయాన్ని విద్యార్థి భవన్ వారు నెట్టింట పోస్ట్ చేసి వెల్లడించారు.
ఏ దేశ సైనిక శక్తికైన ఆర్ధిక వనరులు ఎంతో ప్రధానం. మరీ ముఖ్యంగా యుద్ధంలో పాల్గొనే దేశాలు మరింతగా ఆర్ధిక కేటాయింపులు చేయాలి. లేదంటే యుద్దానికి దిగకూడదు. ప్రారంభమైన యుద్ధం ఎప్పుడు ముగుస్తోందో తెలియకపోతే సొంత సైనికులే నిలదీసే పరిస్ధితులు వస్తాయని ఉక్రెయిన్-రష్యా వార్ తో తెలివచ్చేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది
పాకిస్థాన్ లో స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ గురువారం నాడు ఒక ర్యాలీ నిర్వహిస్తుండగా అతనిపై ఓ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం సాయంత్రం తన ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరపడంతో గాయపడ్డారు.
2020లో మిస్ అర్జెంటీనా మరియు మిస్ ప్యూర్టో రికోలను గెలుచుకున్న మరియానా వరెలా మరియు ఫాబియోలా వాలెంటిన్ రెండేళ్లపాటు రహస్యంగా డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి ఊపందుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐ - ఫోన్ప్యాక్టరీ చుట్టుపక్కల లాక్డౌన్ విధించారు అధికారులు. దీంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఫ్యాక్టరీ గోడదూకి పారిపోతున్నారు. అధికారులు కఠిమైన నిబంధనలు అమలు చేస్తారన్న ఆందోళనతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.