Home / International News
ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది.
ట్విట్టర్‌లోని ఓ కీలక పదవిని చేపట్టేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మస్క్ అవకాశం కల్పించారు. భారతీయ అమెరికన్ అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.
డబ్బులు ఊరికే రావు అన్న మాటను ఇప్పుడు మస్క కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉచితం కాదు. బ్లూ టిక్ పొందడం కోసం నెలకు 8 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.660 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
నేపాల్ దేశంలో ఈ నెల 20న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో తమ తమ అభ్యర్ధులతో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో వందేళ్ల ఓ వృద్దుడు కూడా ఎన్నికల పోటీలో నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫ్లోరిడాలో కమ్యూనిస్ట్ నేత సీపీఐ కార్యదర్శి నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. మియామి విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకొనింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ పేరుతో ఆయన్ను మూడు గంటల పాటు వేధించారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వింత అనుభవం ఎదురైయ్యింది. సోమవారం నాడు చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు సరైన వార్నింగ్ లేకుండానే డిలీట్ అయ్యాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చాలా మంది యూజర్లు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఇరాన్లో సెలెబ్రిటి చెఫ్ మెహర్షాద్ షాహిదీ పోలీసుల చేతిలో దుర్మరణం పాలయ్యాడు. షాహిదీని బ్రిటన్‌కు చెందిన జెమీ ఆలివర్‌గా సంబోధిస్తుంటారు.
స్కాట్లండ్‌లోని ఎడిన్బర్గ్లో ఒక మహిళ తన ముందు తలుపు రంగును మార్చకపోతే 20,000 పౌండ్లు (రూ. 19.10 లక్షలు) ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ఇండిపెండెంట్‌లోని ఒక నివేదిక పేర్కొంది.
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.