Last Updated:

The Sun is Smiling: సూర్యుడు నవ్వేస్తున్నాడు.. నమ్మరా.. ఇదిగో చూసెయ్యండి

సౌరవ్యవస్థలో భగభగమండే ఆ సూర్యుడి గురించి మనం ఎన్నో విన్నాం ఆయన వేడిమి ముందు ఎవరూ నిలువలేరని తెలిసిన విషయమే. కాగా సూర్యుడు కూడా బోసినవ్వులు విరజిమ్ముతాడని. మనల్ని చూసి నవ్వుతున్నట్టు మీరెప్పుడైనా చూశారా.. చూడలేదు కదా అయితే ఇదిగో చూడండి ఇలా నవ్వుతున్నాడు అంటూ నాసా ఒక ఫొటోను విడుదల చేసింది.

The Sun is Smiling: సూర్యుడు నవ్వేస్తున్నాడు.. నమ్మరా.. ఇదిగో చూసెయ్యండి

The Sun is Smiling:  సౌరవ్యవస్థలో భగభగమండే ఆ సూర్యుడి గురించి మనం ఎన్నో విన్నాం ఆయన వేడిమి ముందు ఎవరూ నిలువలేరని తెలిసిన విషయమే. కాగా సూర్యుడు కూడా బోసినవ్వులు విరజిమ్ముతాడని. మనల్ని చూసి నవ్వుతున్నట్టు మీరెప్పుడైనా చూశారా.. చూడలేదు కదా అయితే ఇదిగో చూడండి ఇలా నవ్వుతున్నాడు అంటూ నాసా ఒక ఫొటోను విడుదల చేసింది.

సూర్యుడు ఎప్పుడూ నిప్పులు కక్కుతూ ఉగ్రరూపంతో భూమిపై కనిపిస్తుంటాడు. కానీ సూర్యుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు అంటూ కొందరు కవులు, కర్టూనిస్టులు తమ కల్పనతో ఎంతో అందంగా సూర్యుడి గురించి వర్ణించి చూపించారు. అయితే వారి వర్ణన వృథాకాదు. వారి అందమైన ఆలోచనలు అక్షరాలా నిజమయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే యూఎస్ అంతరిక్ష సంస్థ నాసా సూర్యుడు చిరునవ్వుతో కనిపించే ఓ చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

సౌర కుటుంబంలోని మిగిలిన అన్ని గ్రహాలకు వెలుగు అందించే సూర్యుడు నవ్వుతున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వడమంటే నిజంగా నవ్వేస్తున్నాడని కాదండోయ్. సూర్యుడిని అల్ట్రావయలెట్ కాంతిలో ఫొటో తీస్తే దానిలో సూర్యుడిపై రెండు కళ్లు, నోరులా నల్లని ప్రాంతాలు కనిపించాయి.
ఈ ఫొటో చూసిన కొందరు వ్యక్తులు సూర్యుడు నవ్వేస్తున్నాడని అంటున్నారు. అయితే అది నిజంగా నవ్వడం కాదని సూర్యుడి నుంచి వేగంగా సోలార్ వాయువులు అంతరిక్షంలోకి విడుదలయ్యే ప్రాంతాలు ఇలా నల్లగా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని కరోనల్ రంధ్రాలు అంటారని వెల్లడించారు. ఈ ఫొటోను నాసాకు చెందిన సన్, స్పేస్ అండ్ స్క్రీమ్ అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు ది సన్ ఈ స్మైలింగ్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.


ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత చిన్న టీవీ.. దీని సైజ్ ఎంతో తెలిస్తే ఔరా అనక మానరు..!

ఇవి కూడా చదవండి: