Home / International News
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
రోజు వారి వినియోగించే కూరగాయల కొరత బ్రిటన్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా తగ్గిపోయింది.
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
ఖలిస్తానీ గ్రూపులు ఆస్ట్రేలియాలోని దేవాలయాలను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత తాజాగా బ్రిస్బేన్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది. భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు ఖలిస్తానీ జెండాలను ఎగురవేశారు.
తైవాన్ ఈ ఏడాది 500,000 మంది పర్యాటకులకు నగదు లేదా తగ్గింపు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. కరోనా అనంతరం పర్యాటక పరిశ్రమను అభివృద్ది చేయడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
రష్యా - ఉక్రెయిన్ యుద్దానికి సరిగ్గా శుక్రవారంతో ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిరంతరం క్షిపణిదాడులతో దేశం మొత్తం శ్మశానం అయ్యింది
: జాతీయ ఆరోగ్య బీమా సేవ కింద స్వలింగ జంటలు భిన్న లింగ జంటలకు సమానమైన జీవిత భాగస్వామి కవరేజీకి అర్హులని దక్షిణ కొరియా కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్‌లో కాకుండా ఎకనమి క్లాస్‌లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కాకుండా సాధారణ హోటల్లో దిగాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.
గత ఏడాది యూరప్‌లో ఎండలు ఠారేత్తించాయి. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు కనిపిస్తున్నాయి.