Home / Hyderabad
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
2016లో వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్ నుండి రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేష జనాదరణ పొందుతుంది. తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. జడ్చర్ల నుంచి పాదయాత్ర ద్వారా షాద్ నగర్ చేరుకున్న రాహుల్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్లో ఉన్న చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది.
పదోతరగతి, ఐటీఐ విద్యార్ఙత కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంస్థలో ఏడాది అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగం దరఖాస్తులు కోరుతోంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగుతూ ఇవాళ హైదరాబాద్కు చేరుకోనుంది. రాహుల్ గాంధీ నేడు భాగ్యనగరంలో అడుపెట్టనున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించింది.
హైదరాబాదు బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారి పై లైంగిక దాడి ఘటన కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై స్పందించిన చిరంజీవి, చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం అమానుషంగా పేర్కొన్నారు.