Home / Hyderabad
హైదరాబాద్‌లోని కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) ప్రాంతీయ బెంచ్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి పురుషుడిగా మారారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కోపం వచ్చింది. హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ, తోపులాట అధికం కావంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు నలుగురు యువతుల అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు యువతులను ఢిల్లీ నుంచి పిలిపించారు. ఫామ్‌హౌస్‌లో యువతీయువకుల అసభ్యకర నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
దీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు.
మాదాపూర్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నటుడు సోనుసూద్ సందర్శించారు. కాసేపు ఆమెతో సరదాగా ముచ్చటించారు. అనంతరం కుమారి ఆంటీ ఫుడ్ మెనూ రేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి.. తన బాగోగులు అడిగి తెలుసుకున్నందుకు కుమారి ఆంటీ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ప్రియురాలితో ఉండగా భర్త ప్రవీణ్‌ను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముషీరాబాద్ ఎస్ఆర్టి కాలనీకి చెందిన ప్రవీణ్ గత కొంత కాలంగా ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు.
హైదరాబాద్ లోటస్ పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ పాండ్‌లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది.
హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు పీక్కు తిన్న సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సాత్విక్ అనే బాలుడిని అతి దారుణంగా కుక్కలు కొరికి చంపాయి.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
జీవితాంతం తోడుంటానన్న భర్త చివరికి భార్యనే హతమార్చాడు. ఈ దారుణం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ అయిన తన భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు.