Home / Hyderabad
Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
KTR: హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని.. అయినా కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.
Hyderabad Metro: హైదరాబాద్ కు మణిహారంగా వెలుగొందుతుంది మెట్రో రైల్. తెలుగు రాష్ట్రాల్లో మెట్రో రైల్ సౌలభ్యం ఉన్నది హైదరాబాద్ లో మాత్రమే. మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో కూడిన మెట్రో మార్గం ఉంది.
Mujra party: హైదరాబాద్ లో యువతులతో నగ్న నృత్యాలు చేయిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. పార్టీల పేరుతో అమ్మాయిల గలీజ్ దందాలోకి లాగి.. నిర్వాహకులు లాభాలను ఆర్జిస్తున్నారు.
LB NAGAR: తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
Etela Rajender: ప్రశ్నపత్రాల లీకేజీపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. మా నౌకరీలు మాకు కావాలే అనే నినాదంతో భాజపా తలపెట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: బండి సంజయ్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు అందించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వాటిపై వివరణ ఇవ్వాలని కోరుతూ మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
TSPSC Exams: ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.