Home / Hyderabad
Hyderabad Metro Charges Hike Today Onwords: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. పెరిగిన మెట్రో ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ తెలిపింది. ఇప్పటివరకు తొలి రెండు స్టాఫ్‌లకు రూ. 10 ఉండగా.. కొత్త ఛార్జీల ప్రకారం రూ. 2 పెంచారు. దీంతో మొదటి రెండు స్టాఫ్‌లకు రూ. 12 వరకు పెరిగింది. అంతకుముందు గరిష్టంగా రూ. 60 ఉండగా.. తాజాగా, రూ.75కు చేరింది. దీంతో మెట్రో ప్రయాణికులు అసహనానికి […]
Telangana: విదేశాలకు వెళ్లాలంటే ఏం కావాలి అంటే.. ఠక్కున పాస్ పోర్ట్, వీసా కావాలి అని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు సాధారణ పాస్ పోర్ట్ జారీ చేస్తున్న పాస్ పోర్ట్ కార్యాలయాలు ఇక నుంచి అధునాతన, చిప్ ఆధారిత పాస్ పోర్ట్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో ‘ఈ చిప్ ఆధారిత పాస్ పోర్ట్’ జారీ చేసేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. కాగా విదేశాంగ మంత్రిత్వశాఖ […]
CM Revanth Reddy Commnets in Review of Electricity Department: ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని, భవిష్యత్‌లో డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ మారనుందని సీఎం తెలిపారు. ఈ మేరకు విద్యుత్ టవర్లు, లైన్లు స్తంభాలు కనిపించకూడదని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే […]
Raids: ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అవినీతి అధికారి చిక్కాడు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అక్కడ బయటపడిన బంగారం, డబ్బు చూసి నోరెళ్ల బెట్టారు. అసలు ఆ అధికారికి ఇంత నగదు, బంగారం ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ విచారణ చేసతోంది. హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. బిల్డర్స్ తో కుమ్మక్కై 41 భవనాలకు […]
Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌కు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న 10 మంది సిబ్బంది రక్షిస్తుంది. వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉదయం మంటలు చెలరేగాయి. […]
Heavy Rain Alert in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ , నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లోనూ వానలు పడనున్నట్లు తెలిపింది. కాగా, తెల్లవారుజాము నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. […]
Rain Alert to Telangana State: తెలంగాణలో ఇవాళ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సిద్దిపేట, యాదాద్రి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో లు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇంటి బయటకు రావొద్దని […]
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, మియాపూర్, ప్రగతినగర్, కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, మాసాపేట, జగద్గిరిగుట్టలో భారీగా వర్షం పడుతుంది. కాగా కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలకు వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు వర్షం కొన్ని ప్రాంతాల్లో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
3 Dead in Road Accident at Hyderabad Outer Ring Road: తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని అబ్ధుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి కారు.. ఎదురుగా ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. అయితే బొలెరో వాహనాన్ని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ఇరుక్కుపోయింది. కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీస్తుండగా మంటలు చెలరేగాయి. బొలెరో డ్రైవర్ ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మంటల్లో సజీవ దహనమయ్యారు. […]
Miss World 2025 @Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి […]