Home / heavy rains
మండలానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ వర్షాల కారణంగా అన్నీ నదులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. పలు బ్యారేజీలకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం, అందవెల్లి వద్ద వంతెన కూలింది.
చినుకు పడితే చిత్తడి చిత్తడిగా ప్రధాన రహదారులు, పొంగి పొర్లే మురికి నాలాలు, ఎటు చూసిన బురదమయం, అంతకుమించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నాలాలు. ఇది భాగ్యనగరంలో నిత్యం చోటు చేసుకొనే తంతు.
ఏపీలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అతాకుతలం చేశాయి. హిందూపూర్, అనంతపురం, కదిరి ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి కొన్ని దేశాలు అల్లాడుతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాను భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్కు సమీపంలోని లాస్ టెజెరస్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగా కురవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.