Home / Cricket
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి.. అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు.
టీ20 సిరీస్ గెలుపుతో ఉత్సహాంగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ సాయంత్రం లండన్ లోని ఓవల్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని టూర్ ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.
రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టి20 జరగనుంది. సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టి20 గెలుపు ఉత్సహాంతో ఉన్న టీమిండియా సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది.