Home / CM YS Jagan
ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.
సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
సీఎంను అర్జంటుగా ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్ విమర్శలు చేసిన క్రమంలో ఆ పార్టీ శ్రేణులో రగిలిపోతున్నారు. జగన్మోహన రెడ్డి అవనిగడ్డలో ఇష్టమొచ్చిన్నట్లు మాట్లాడరని మండిపడ్డారు.
ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన కోడికత్తి హత్యాయత్నం కేసులో నిందుతుడుగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోసం అతని తల్లి నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ నెల 25న తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టేందుకు ఆమె సమాయత్తమౌతుంది.
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకనందా రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చేసింది
92 మంది మంది జనసైనికుల పై కేసు నమోదు చేసి 70 మంది అరెస్టు. విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట.
పవన్ విజయవాడ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న జనసేన. నేతలతో భేటీ తర్వాత రానున్న క్లారిటీ.
ఏపీ సీఎం జగన్, భార్య భారతీ ఇద్దరూ కలసి గవర్నర్ బిశ్వభూసన్ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు చేరుకొన్న సీఎం దంపతులకు సంయుక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు.
ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని, పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉమా ఏపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.