Home / CM YS Jagan
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
సమస్యలు విన్నవించుకోవాలంటూ సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకొనేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది. ఈ ఘటన గన్నవరం విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకొనింది.
సీఎం జగన్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరని.. అలాంటి వ్యక్తి సోషలిస్ట్గా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
మంత్రి రోజా ఇలాకాలో వర్గపోరు ముదిరిపాకాన పడింది. పార్టీలో కీలక నేతలు రెండుగా విడిపోయారు. పోటా పోటీ కార్యక్రమంలో రోజమ్మకు నిద్రలేకుండా చేస్తున్నారు. విసిగివేశారిన మంత్రి రోజా ఇక మహాప్రభు నువ్వే దిక్కంటూ జగన్ కు ప్రత్యర్ధి వర్గంపై ఫిర్యాదు చేశారు. దీంతో నగరి వైసిపి పార్టీలోని అంతర్గత పోరు మరోమారు బయటపడింది.
విజయవాడ రూరల్ పరిధిలోని జక్కంపూడి కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ముస్సోరిలో మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఇందుకేనా అంటూ ఐఏఎస్, ఐపీఎస్ ల నుద్ధేశించి మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ కోసం కుటుంబం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిందితుడి కుటుంబం బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చింది.
పంపుడు స్టోరేజి ప్లాంట్స్ (పిఎస్పీ) స్కీం కింద కడపకు చెందిన సీఎం జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కు వందల ఎకరాల భూమి ధారదత్తం చేశారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ రుజువులతో మీడియాకు చూపించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియచేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్నానంపై జ్నానం, దుష్ట శక్తులపై దైవశక్తి, సాధించిన విజయాలకు ప్రతీకే దీపావళిగా ఆయన తెలిపారు.
ఈ దినం ఉదయం విజయవాడ జింఖానా మైదానంలో చోటుచేసుకొన్న బాణసంచా దుకాణాల అగ్ని ప్రమాదంలో ఇరువురు చనిపోయిన సంగతి విధితమే. దీనిపై భాజపా నేత విష్ణు వర్ధన రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రమాదకర వ్యాపారాలకు నగరంలోని కీలక ప్రాంతంలో ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.