Home / CM KCR
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.
మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు.
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
సీఎం కేసీఆర్.. తెలంగాణాలో ఇన్నాళ్లూ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే.. గంత కాలంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్ఎస్లో సహజంగానే కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా,
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా, నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సోమవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి